స్థంభించిన బ్యాంకింగ్ రంగం
` ప్రైవేటీకరణ చర్యలకు నిరసనగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మె
` బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్దొద్దని డిమాండ్
` దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది ఉద్యోగుల నిరసన
` ప్రైవేటీకరణతో కొట్లాది మందికి నిరుపేదలకు రుణాల లభ్యత తగ్గుతుందని వెల్లడి
హైదరాబాద్,డిసెంబరు 16(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. బ్యాంక్ ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు రెండు రోజుల పాటు ఉద్యోగులు, సిబ్బంది సమ్మెకు దిగారు. దాదాపు ప్రభుత్వ రంగ బ్యాంకుల ముందు ఆందోళనకు దిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అందులో గురువారం మొదటి రోజు సమ్మెతో బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడిరది. బ్యాంకుల ఎదుట ఉద్యోగులు ధర్నాలు చేపట్టి, కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.సమ్మె నోటీసుకు అనుగుణంగా బ్యాంకు ఉద్యోగులు బంద్ పాటిస్తున్నారు. అడిషనల్ చీఫ్ లేబర్ కమిషనర్‌తో బుధవారం జరిగిన చర్చలు విఫలం అయ్యాయని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కన్‌ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ సౌమ్య దత్త ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగగా.. గురువారం ఉదయం సానుకూల నిర్ణయం ప్రభుత్వం నుంచి వెలువడకపోవడంతో బుధవారం ఉదయం నుంచి సమ్మెలోకి దిగాయి బ్యాంక్ యూనియన్లు. సుమారు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు గురు, శుక్రవారాల్లో బ్యాంకుల సమ్మెలో పాల్గొననున్నారు. సమ్మె నేపథ్యంలో వినియోగదారులు తమ ఆర్థిక లావాదేవీల విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాసహా పలు బ్యాంకులు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ తొమ్మిది యూనియన్ల ప్రాతినిధ్య వేదిక యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఈ సమ్మె పిలుపు ఇచ్చింది. బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లు (బ్యాంకింగ్ లాస్ సవరణ బిల్లు, 2021)ను ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి కూడా కేంద్రం సిద్ధమవుతోంది. అయితే ఈ బిల్లును ప్రవేశపెట్ట బోమని ప్రభుత్వం స్పష్టమైన హావిూ ఇస్తేనే సమ్మె విరమణ ఉంటుందని యూనియన్లు స్పష్టం చేస్తుండగా, అటువంటి హావిూ ప్రభుత్వం నుంచి రావట్లేదు. ప్రభుత్వ రంగం బ్యాంకుల్లో రెండిరటిని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రైవేటీకరించాలని ప్రభుత్వం బడ్జెట్2021`22లో కేంద్రం నిర్ణయించడం.. ఆ దిశగా ప్రక్రియను కూడా ప్రారంభించిన నేపథ్యంలో.. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి సంఘాలు. దీనిపై ముందుగానే సమ్మె నోటీసు కూడా ఇచ్చాయి. ఈ సమ్మె తమ కోసం కాదని, బ్యాంకులను ప్రైవేట్‌పరం చేస్తే బలహీన వర్గాలకు రుణాల లభ్యత తగ్గుతుందని.. కోట్లాది మంది డిపాజిట్లు రిస్క్‌లో పడతాయని హెచ్చరిస్తోంది మొత్తం తొమ్మిది యూనియన్లు యూఎఫ్‌బీయూ నేతృత్వంలో ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు.ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవడంతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయాలని కోరుతోంది. ఈ దేశంలో సామాన్యులకు సేవలందించడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు వుండడం చాలా అవసరమని పేర్కొంది. 1969లో బ్యాం కులను జాతీయకరణ చేసిన తర్వాతనే పేదలు, అవసరంలో వున్నవారికి బ్యాంకుల సేవలు అందాయన్న విషయం గుర్తుం చుకోవాలని సూచిస్తోంది. 1969లో 8 వేలుగా వున్న ప్రభుత్వ రంగ శాఖలు ప్రస్తుతం 1.18 లక్షలకు చేరాయంటేనే ఎంతగా అభి వృద్ధి చెందాయో తెలుస్తోందని. కానీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు సమర్ధవంతంగా పనిచేయడం లేదని, నష్టాల్లో నడుస్తున్నాయని చిత్రీకరించేందుకు కుట్రలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. మరోవైపు.. బ్యాంకు ఉద్యోగుల, అధికారుల సమ్మెకు రైల్వే యూనియన్ సహా ఇతర సంఘాలు కూడా మద్ధతు ప్రకటిస్తున్నాయి.ఈ సమ్మెతో స్టేట్ బ్యాంక్‌ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూసీవో బ్యాంక్ సహా పలు ప్రైవేట్‌రంగ బ్యాంకుల సేవలకు విఘాతం కలగనుంది. బ్యాంకింగ్ సేవలతో పాటు ఏటీఎం, ఇతర సేవలపైనా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.