స్థానిక ఎన్నికల్లో కోవిడ్‌ రోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌

కేరళ సర్కార్‌ పరిశీలన

తిరువనంతపురం,నవంబర్‌7(జ‌నంసాక్షి): సంక్షోభ సమయంలో అర్తులను ఆదుకోవడంలో ముందుఉండే కేరళలోని పినరయి విజయన్‌ ప్రభుత్వం మరో సూర్ఫిదాయకమైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో కోవిడ్‌-19 రోగులు, కార్వంటైన్‌లో ఉన్న వారి కోసం పోస్టల్‌ బ్యాలెట్లు అమలు చేయాలని భావిస్తోంది. కరోనా రోగుల కోసం మరిన్ని విభిన్న ఎంపికలపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి భాస్కరన్‌ తెలిపారు. కోవిడ్‌ రోగులను పిపిఈ కిట్లతో ఓటింగ్‌కు అనుమతించే విషయం కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అవసరమైన కిట్లను పంపిణీ చేయడానికి హెల్త్‌ డైరెక్టర్‌ అంగీకరించారని భాస్కరన్‌ వెల్లడించారు. దీనినిపై ఎన్నికల కవిూషన్‌ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా, పోస్టల్‌ బ్యాలెట్లు వేయాలనుకునే కరోనా రోగులు మూడు రోజుల ముందుగా దరఖాస్తు అందచేయాల్సి ఉంటుంది. అవసరమైన మెడికల్‌ పత్రాలతో దరఖాస్తులను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాలి.