స్థానిక సంస్థలపై పెత్తనం వదులుకోగలరా?
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయఫ్రంట్ ఏర్పాటు కోసం తాజాగా తమిళనాడుకు చెందిన డిఎంకె అధినేతలలో చర్చించారు. కేంద్ర పెత్తనం పోవాలని, పాలన వికేంద్రీకరణ జరగాలని కోరుతున్నారు. ఈ సమస్యల ఎప్పటి నుంచో ఉంది. అధికారం చేపట్టిన తొలినాళ్లలో ప్రధాని మోడీ కూడా నీతి ఆయోగ్ ఏర్పాటు సమయంలో రాష్టాల్రకు స్వేచ్ఛనిస్తామని ప్రకటించారు. కానీ అలా జరగలేదు. అయితే అధికారాల బదలాయింపులో రాష్టాల్ల్రో అధికారంలో ఉన్న పార్టీలు కూడా ఇందుకు భిన్నంగా వ్యవహరించడం లేదు. స్థానిక సంస్థలకు నిధులు,అధికారాలు బదలాయించడం లేదు. నిధులు ఇవ్వడం లేదు. ప్రతి పనికి పెత్తనం రాష్ట్రప్రభుత్వందే అవుతోంది. గ్రామంలో చెరువు పూడికతీ నిర్ణయం కూడా సిఎం స్థాయిలో జరుగుతోంది. గ్రామంలో సర్పంచ్ సభ ద్వారా చర్చించి పనులు చేపట్టే అవకాశం లేదు. గ్రామాల్లో పనులన్నీ పైనుంచి పెత్తనంతో జరుగుతున్నాయి. పనులు చేపట్కటాలంటే పంచాయితీలకు నిధులు లేవు. దేశవ్యాప్తంగా రాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావాలనే ప్రజల మనోభావాలకు అనుగుణంగా, దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు, సుభిక్షమైన ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకే సమాఖ్య కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన చేస్తున్న పర్యటనలు ఫలించి సమాఖ్యకు అర్థం వచ్చేలా గుణాత్మక మార్పులు రావాల్సి ఉంది. అయితే ఫెడరల్ ఫ్రంట్ గురించి ప్రయత్నాలు చేస్తున్న సిఎం కెసిఆర్ ముందుగా గ్రామాలను బలోపేతం చేసేలా చూడాలి. గ్రామాలను ఆర్థకింగా పరిపుష్టం చేసేలా నిధులు మళ్లించాలి. గ్రామాలు తీర్మినం చేసిన పనులు సాగాలి. గ్రామాల్లో ఏ పనులు అవసరమో వారే చేసుకునేలా అధికార వికేంద్రీకరణ జరగాలి. తెలంగాణ నుంచే ఈ మార్పును ప్రోత్సహిస్తే సిఎం కెసిఆర్ చేసే ప్రయత్నాలకు బలం చేకూరుతుంది. కేంద్రాన్ని తిడుతున్న మనం.. రాష్ట్రంలో ఏం చేస్తున్నామో ఆలోచన చేయాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజంగానే మనం స్థానిక సంస్థలకు నిధులు, విధులు బదలాయించామా అన్నది ఆత్మవిమర్శ చేయాలి. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం,చెరువుల పునరుద్దరణ, కాలువల తవ్వకం మొదలు అనేకానేక పనులన్నీ సర్కార్ పెత్తనంతోనే సాగుతున్నాయి. చైనా విజయం వెనక గ్రామాలకు స్వేఛ్చ ఉంది. కిందిస్థాయినుంచే నిర్ణయాలు జరుగుతాయి. అలా చేసి చూపడం ద్వారా అధికారాల్లో ఉన్న ఆయా రాష్ట్రలు ముందుకు నడవాలి. బిజెపి,కాంగ్రెస్ పార్టీలు అధికారంలో లేని తెలంగాణ, ఎపి,బెంగాల్, ఒరిస్సా,కేరళ తదితర రాష్టాల్ల్రో స్థానిక సంస్థలకు ముందుగా నిధులు,విధులు బదలయించాలి. వాటిని ఆచరణ సాధ్యం చేయాలి. రాష్టాల్రపై కేంద్ర ప్రభుత్వ పెత్తనం పోవాలని, దేశం నిజమైన సమాఖ్య వ్యవస్థగా మారితేనే అన్ని రాష్టాల్రకు, ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని అంటున్న కెసిఆర్ ఈ రకంగా ముందు తమ చేతల్లో ఉన్న పనులు చేసి చూపాలి. అప్పుడే కెసిఆర్ ప్రయత్నం మరింతగా రాణిస్తుంది. భాజపా, కాంగ్రెస్సేతర పార్టీలకు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు సన్నాహాల్లో భాగంగా ఆదివారం ఆయన చెన్నైలో పర్యటించారు. డీఎంకే పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తమిళనాడు శాసనసభ విపక్ష నేత స్టాలిన్‌తో భేటీ అయ్యారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా విద్య, వైద్యం, సాగు, తాగునీరు, ఉపాధికల్పన తదితర అనేక సమస్యలను కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, భాజపాలు పరిష్కరించ లేక పోయాయి. దేశాభివృద్ధికి అనుకూలంగా లేని పరిస్థితులు కొనసాగుతున్నాయి. జపాన్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చూస్తున్నాం. అలాగే భారత్‌లోనూ జరగాలి. కాంగ్రెస్, భాజపా వ్యతిరేక కూటమికి దేశంలో అవకాశం ఉంది. ఇందుకోసం సారూప్యత ఉన్న
పార్టీలతో చర్చిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీతో, కర్నటకలో దేవేగౌడతో చర్చించారు. కొత్త కూటమి కోసం దక్షిణాది రాష్టాల్రు ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. రాష్టాల్రకు కేంద్రం మరిన్ని అధికారాలివ్వాలని, కేంద్రంతో సంబంధం లేని వాటిని రాష్టాల్రకు బదలాయించాలన్నారు. కూటమిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోనూ చర్చిస్తామని తెలిపారు. నిజానికి కెసిఆర్ ప్రయత్నం మంచిదే అయినా చిత్తశుద్ది చాటాలంటే రాష్టాల్ల్రో స్థానిక సంస్థలను బలోపేతం చేయకుండా చేస్తున్న ప్రయత్నం కేవలం రాకయీ ప్రయత్నంగానే మిగిలిపోగలదు. తండాలను పంచాయితీలుగా మార్చి విప్లవాత్మక నిర్ణం తీసుకున్న కెసిఆర్ వాటిని బలోపేతం కోసం ఉన్న చట్టాలను ముందుగా అమలు చేయాలి. రాస్టం నుంచి పంచాయితీలు లేదా స్థానిక సంస్థలకు నిధులు ,విధులు బదలాయించడం అన్నది కూడా సమాఖ్య స్ఫూర్తికి అర్థంగా నిలుస్తుంది. లేకుంటే కేంద్రం తీరనుగానే రాష్టాల్రు కూడా స్థానిక సంస్ళతపై పెత్తనం చేస్తున్నాయనే అనుకోవాలి. మార్పు ఇక్కడ రాకుండా అక్కడ రావాలని కోరుకోవడం సరికాదు. మన నుంచే మార్పు మొదలయితే మంచిది. నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పులు చోటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. జాతీయ స్థాయిలో అనేక సమస్యలు సామాన్యులకు ఇబ్బంది కలిగేలా మారాయి. ఉపాధి హావిూనే తీసుకుంటే ఇక్కడ పనిచేసే పనిని నిర్ణయంచడం, వారికి కూలీ చెల్లించడం అంతా కేంద్రం అజమాయిషృలో సాగుతోంది. ఇటీవల కేరళలో రాష్టాల్ర ఆర్థికమంత్రుల సమావేశంలోనూ కేంద్రపెత్తనంపై చర్చించారు. గుణాత్మక మార్పుల కోరుకుంటున్నవారు మార్పు తమనుంచే మొదలయితే బాగుంటుందని గుర్తించి అందుకు అనుగుణంగా కార్యాచరణకు దిగాలి.