స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి నేడు కవిత నామినేషన్

ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు నిర్ణయం

హైదరాబాద్,మార్చి 17(జనంసాక్షి): రాజ్యసభ ఛాన్స్ మిస్ కావడంతో టీఆర్ఎస్ నేత కవిత రాజకీయ భవిష్యత్తు ఏమిటనే దానిపై టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే ఆమెను నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దింపేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతోందని తెలుస్తోంది. రెండేళ్ల పదవి కాలం ఉండే ఈ పదవి కోసం కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే కవితను ఈ స్థానం నుంచి బరిలోకి దింపాలని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. దీనిపై టీఆర్ఎస్ అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే… రేపే ఎమ్మెల్సీ పదవికి కవిత నామినేషన్ వేస్తారని టీఆర్ఎస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పార్టీ మారడం… ఆయనపై అనర్హత వేటు పడటంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. కవిత ఎమ్మెల్సీగా బరిలోకి దిగితే… ఆమె రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా మారే అవకాశాలు కనిపిస్తు న్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న కవిత… ఎమ్మెల్సీగా ఎన్నికైతే మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లో బిజీ అయినట్టే అనే చెప్పుకోవాలి.

తాజావార్తలు