స్మార్ట్ సిటీలో తెలంగాణకు మొండిచేయి
– ఆంధ్రాకు 3 తెలంగాణకు గుండు సున్నా
– వెంకయ్య ఆంధ్రా మార్క్ ప్రభావం
న్యూఢిల్లీ,జనవరి28(జనంసాక్షి): వెంకయ్య ఆంధ్రా మార్క్ ప్రభావంతో స్మార్ట్ సిటీల జాబితాలో కేంద్రం తెలంగాణకు మొండిచేయి చూపింది.స్మార్ట్ సిటీల తొలి జాబితాలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన నగరాలు విశాఖపట్నం, కాకినాడలకు స్థానం దక్కింది. 20 నగరాల పేర్లతో కూడిన స్మార్ట్ సిటీల తొలి జాబితాను గురువారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీల ఎంపికలో పారదర్శక విధానం పాటించామన్నారు. ఆకర్షణీయ నగరాల కోసం రూ. 3 లక్షల కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఆకర్షణీయ నగరాలతో జీవన ప్రమాణాలు మెరుగవుతావుతాయని అన్నారు. స్మార్ట్ సిటీ చాలెంజ్ లో తెలంగాణ నగరాలకు అవకాశం దక్కలేదు. ఒక పాయింట్ తేడాతో వరంగల్ అవకాశం కోల్పోయింది. విశాఖ 8, కాకినాడ 14 స్థానాల్లో నిలిచాయి.
ఇందులో ఎపిలో రెండు పట్టణాలు ఉండగా తెలంగాణ నుంచి ఒక్క నగరాన్ని కూడా గుర్తించలేదు. ఎపిలో విశాఖపట్టణం,కాకినాడ సిటీలు స్థానం దక్కించుకున్నాయి. స్మార్ట్ సిటీల తొలి జాబితాలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన నగరాలు విశాఖపట్నం, కాకినాడలకు స్థానం దక్కింది. 20 నగరాల పేర్లతో కూడిన స్మార్ట్ సిటీల తొలి జాబితాను గురువారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీల ఎంపికలో పారదర్శక విధానం పాటించామన్నారు. ఆకర్షణీయ నగరాల కోసం రూ. 3 లక్షల కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఆకర్షణీయ నగరాలతో జీవన ప్రమాణాలు మెరుగవుతావుతాయని అన్నారు. స్మార్ట్ సిటీ చాలెంజ్ లో తెలంగాణ నగరాలకు అవకాశం దక్కలేదు. ఒక పాయింట్ తేడాతో వరంగల్ అవకాశం కోల్పోయింది. విశాఖ 8, కాకినాడ 14 స్థానాల్లో నిలిచాయి. ఇక కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీల్లో భువనేశ్వర్ (ఒడిశా), పుణె(మహారాష్ట్ర), జయపుర(రాజస్థాన్), సూరత్(గుజరాత్), కోచి(కేరళ), జబల్‌పూర్(మధ్యప్రదేశ్)
న్యూదిల్లీ మున్సిపల్ కౌన్సిల్ , విశాఖపట్నం(ఆంధప్రదేశ్), కాకినాడ(ఆంధప్రదేశ్), షోలాపూర్(మహారాష్ట్ర)
కోయంబత్తూర్(తమిళనాడు), బెళగావి(కర్ణాటక), దావణగెరె(కర్ణాటక), అహ్మదాబాద్(గుజరాత్),
గువహటి(అస్సోం), చెన్నై(తమిళనాడు), లూథియానా(పంజాబ్), భోపాల్(మధ్యప్రదేశ్), ఉదయ్‌పూర్(రాజస్థాన్), ఇండోర్(మధ్యప్రదేశ్) ఉన్నాయి.
విశాఖ కాకినాడలకు మహర్దశ
కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా విడుదల చేసిన 20 స్మార్ట్ నగరాల జాబితాలో ఆంధప్రదేశ్‌లోని విశాఖ, కాకినాడ నగరాలు స్థానం దక్కించుకున్నాయి. ఆకర్షణీయ నగరంగా ఎంపికయ్యేందుకు కేంద్రం పెట్టిన నిబంధనలను రెండు నగరాల పురపాలక సంఘాలు పూర్తి చేయడంతో తొలి జాబితాలోనే స్థానం సాధించాయి. రాష్ట్రంలో జనాభా పరంగా విశాఖ(18లక్షలు) తొలి స్థానం, కాకినాడ 8వ స్థానంలోనూ ఉన్నాయి. దీనికింద విశాఖ నగరంలో 10వేల మందికి సరిపడేలా అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌నిర్మాణం
నిరంతర నీటి సరఫరాకు ప్రతిపాదనలు ఉన్నాయి. సాగరతీరంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో వాటర్ స్పోర్ట్స్ నిర్మిస్తారు. జీవీఎంసీ పరిధిలో 1700 ఎకరాల్లో అభివృద్ధి పనులు చేపడతారు.
అమెరికా సాయంతో నగరాభివృద్ధి చేస్తారు. కాకినాడకు స్మార్ట్ సిటీ కింద రూ.200 కోట్లు చొప్పున ఐదేళ్ల పాటు నిధులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో విస్తీర్ణ పరంగా 12వ స్థానంలో ఉన్న నగరాన్ని 7 జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తారు. నగరంలోని వివేకానంద పార్కులో గోదావరి కళాక్షేత్రం నిర్మాణం చేస్తారు.
పాత పురపాలక బంగ్లాలో బడ్జెట్ ¬టళ్లు, కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తారు. కుళాయి చెరువు వద్ద మల్టీప్లెక్స్ థియేటర్లతో కూడిన వాణిజ్య సముదాయం, జపాన్ సాయంతో నగరాభివృద్ధి చేపడతారు.
తొలి జాబితాలోని స్మార్ట్ సిటీలు:1. భువనేశ్వర్ 2. పుణె 3. జైపూర్ 4. సూరత్ 5. కొచ్చి 6. అహ్మదాబాద్ 7. జబల్పూర్ 8. విశాఖపట్నం 9. సోలాపూర్ 10. దావణగెరె 11. ఇండోర్ 12. న్యూఢిల్లీ 13. కోయంబత్తూరు 14. కాకినాడ 15. బెల్గావి 16. ఉదయపూర్ 17. గువాహటి 18. చెన్నై 19. లుథియానా 20. భోపాల్