స్వచ్చ్ మంథనియే మా ధ్యేయం – మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ – పలు వార్డుల్లో సానిటేషన్ పనులనూ దగ్గరుండి పర్యవేక్షణ


జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై పట్టణ సందర్శన నిర్వహించారు. పట్టణంలోని కూరగాయల మార్కేట్, బొక్కలవాగు కట్టపై,ఫైర్ స్టేషన్ వద్ద, లైన్ గడ్డ, పవర్ హౌస్ కాలనీ లో మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో పరిసరాల పరిశుభ్రత,చెత్త చేదరాల తొలగింపు, డ్రైనేజీ క్లీనింగ్ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారానే సీజనల్ వ్యాధులు రాకుండా అరికట్ట వచ్చని, తద్వారానే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సూచించారు.