స్వచ్ఛ గురుకుల్ డ్రైవ్ ను విజయవంతం చేయాలి.

అదనపు కలెక్టర్ మను చౌదరి.
గురుకుల్ డ్రైవ్ కార్యక్రమం పోస్టర్ విడుదల.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 3(జనంసాక్షి):
తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాలలో ఈనెల 5 నుండి 11వ తేదీ వరకు నిర్వహించనున్న స్వచ్ఛ గురుకుల్ డ్రైవ్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను శనివారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో అదనపు కలెక్టర్ మను చౌదరి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..
 జిల్లా వ్యాప్తంగా ఉన్న 11 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన గురుకుల విద్యాలయాలను తీర్చిదిద్దడమే ముఖ్య లక్ష్యంగా స్వచ్ఛ గురుకుల ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు.వారం రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తూ గురుకుల ఉపాధ్యాయులు, స్టాఫ్ అందరు ఇందులో భాగస్వామ్యం అయ్యేలా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ ప్రిన్సిపల్ లను ఆదేశించారు.ప్రతి గురుకుల విద్యార్థుల ఆరోగ్యం, వారి ప్రవర్తన, చదువు తదితర విషయాలపై ప్రోగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.నాగర్ కర్నూల్ జిల్లాలో 11 సాంఘిక సంక్షేమ గురుకులల్లో 7040 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తు న్నారని  తెలిపారు.వారందరిని స్వచ్ఛ గురుకుల్లో భాగ్య స్వాములను చేసి జిల్లా గురుకులాలను స్వచ్ఛతలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా సిబ్బంది అందరూ సమిష్టింగా కృషి చేయాలన్నారు.
 ఈ కార్యక్రమంలో గురుకులాల జిల్లా సమన్వయ అధికారి దానం, వివిధ గురుకులాల ప్రిన్సిపల్ సాయిలత,ఎ. సుమతి,ఎల్ రాములు, వినోద్ ఖన్నా, అక్కులు, జోష్ణ, లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు.