స్వచ్ఛ బాన్సువాడగా మార్చాలి
– పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యాలు బాగుంటాయి
– వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
– బాన్సువాడలో చెత్తసేకరణ ట్రాలీలను ప్రారంభించిన మంత్రి
కామారెడ్డి, మే19( జనం సాక్షి ) : పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మన ఆరోగ్యాలు మెరుగ్గా ఉంటాయని, పట్టణ ప్రజలు స్వచ్ఛత పాటించి బాన్సువాడను స్వచ్ఛభాన్సువాడగా మార్చాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. స్వచ్ఛ బాన్సువాడలో భాగంగా శనివారం పట్టణంలో చెత్త సేకరణకు 10 నూతన ట్రాలీ ఆటోలను మంత్రి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆటోను స్వయంగా డ్రైవింగ్ చేస్తూ పట్టణంలోని కాలనీలలో మంత్రి అవగాహన కల్పించారు.సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వచ్ఛ బాన్సువాడ అందరి బాధ్యత అని, పట్టణ పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలన్నారు. చెత్తను రోడ్లపై, ఖాళీ ప్రదేశాలలో వేయరాదని, చెత్త సేకరణకు ప్రతీ ఇంటికి రెండు బుట్టలను అందించామన్నారు. తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించి, మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుందన్నారు. బాన్సువాడ పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు ఇతర మౌలిక సదుపాయాల కోసం రూ. 25కోట్లు మంజూరయ్యాయని మంత్రి
తెలిపారు. పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ, సిసీ రోడ్డు నిర్మాణం వేగంగా జరుగుతుందని మంత్రి పోచారం తెలిపారు. ఈకార్యక్రమంలో బాన్సువాడ పురపాలక కవిూషనర్ గంగాధర్, ఆర్డీవో రాజేశ్వర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తొలుత మంత్రి ట్రాలీని నడుపుతూ పట్టణంలో పర్యటించారు. ట్రాలీని స్వయంగా నడుపుతూ పట్టణంలోని పరిశ్రభత ఏ విధంగా ఉందని పరిశీలించారు. ఈసందర్భంగా మధ్యమధ్యలో ఆగుతూ స్థానిక ప్రజల ఇబ్బందులను మంత్రి తెలుసుకున్నారు.