స్వచ్ఛ భారత్ : చీపురు పట్టిన సీఎం

స్వచ్ఛ భారత్ కు ప్రజామద్దతు కూడగట్టడం కోసం.. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శనివారం( మే6)  ఉదయం లక్నోలో చీపురు చేతబట్టి రోడ్లు ఊడ్చారు. బాలూ అడ్డా మాలిన్ బస్తీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచవలసిన అవసరంపై ప్రజలను చైతన్యపరిచేందుకు యోగి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

యోగి ఆదిత్య నాథ్ స్థానికులతో మాట్లాడుతూ 2018 వరకు బహిరంగ మల, మూత్ర విసర్జన లేని రాష్ట్రంగా ఉత్తర ప్రదేశ్‌ను తీర్చిదిద్దుతానని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. పాలిథీన్ వాడకాన్ని నిషేధించాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్లు తమ వార్డులు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తవహించాలని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కలలు కంటున్న ‘స్వచ్ఛ భారత్’ సాకారమయ్యేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు సీఎం యోగి.