స్వచ్ఛ సర్వేక్షన్-2022 అవార్డ్స్  లో వరంగల్ బల్దియా కు ఉత్తమ ర్యాంకు

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 01(జనం సాక్షి )

 

కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన స్వచ్ఛ సర్వేక్షన్-2022 లో బల్దియా కు  రాష్ట్రవ్యాప్త 2వ ర్యాంక్ దక్కగా,జీ.హెచ్.ఎం.సి. మొదటి ర్యాంక్ ను దక్కించుకుంది కాగా  జాతీయస్థాయిలో (10 లక్షల జనాభా కేటగిరి లో) 62వ ర్యాంకు దక్కించుకుంది.

 

మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్  మంత్రిత్వ శాఖ శనివారం ర్యాంకులను ప్రకటించింది. 2022 సంవత్సరానికి 10 లక్షల జనాభా కేటగిరి లో  దేశవ్యాప్తంగా 382  నగరాలు పోటీపడగా వరంగల్ మహా నగరానికి 62 వ ర్యాంకు దక్కింది. 2021 లో 115 వ ర్యాంక్ దక్కింది. గతం తో పోలిస్తే ప్రస్తుతం మెరుగైన ర్యాంక్ దక్కింది.  స్వచ్ఛ సర్వేక్షన్- 22 పోటీల్లో  గృహాల నుండి విధి గా చెత్త సేకరణ, రోడ్ల పరిశుభ్రత సమర్థ మరుగుదొడ్ల నిర్వహణ, నగర సుందరీకరణ , మార్కెట్ల పరిశుభ్రత, మురికి కాలువల పరిశుభ్రత రేసిడెంట్స్ ఆవాసాల పరిశుభ్రత, వాటర్ బాడీల పరిశుభ్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని నగరాలు అవలంబిస్తున్న పద్ధతులను క్షేత్ర స్థాయి లో పరిశీలించి, వాటి ఆధారం గా ర్యాంకు లను ప్రకటించింది.

 

దేశ వ్యాప్తం గా  ఇండోర్  (మధ్యప్రదేశ్)  మొదటి ర్యాంక్ ను కైవసం చేసుకోగా, సూరత్ ( గుజరాత్)  రెండవ స్తానం, సాధించగా,నవీ ముంబై (మహారాష్ట్ర ) మూడవ స్థానం దక్కింది.

 

-నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి

 

వరంగల్ నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దటం పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం.  దీనిలో భాగంగా 2021- 2022  లో స్వచ్ సర్వేక్షన్  జాతీయ స్థాయి పోటీల్లో చరిత్రాత్మక ఓరుగల్లు నగరం 84 ర్యాంకు సాధించడం పట్ల మేయర్ గుండు సుధారాణి సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది నాటికి మరింత మెరుగైన ర్యాంక్ సాధించుటకు కృషి చేస్తాం .  గత ఏడాది స్వచ్ఛ సర్వేక్షన్ 10 లక్షల లోపు జనాభా నగరాల్లో జాతీయ స్థాయిలో 115 బ్యాంక్ రాగా ఈ ఏడాది  62 వ ర్యాంక్ సాధించాం.   మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య,కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజారోగ్య విభాగం ఇంజనీరింగ్ పర్యావరణ అధికారులు, సిబ్బంది ముఖ్యన్గా పారిశుద్ధ్య కార్మికుల  కృషి వల్ల సాధ్యమైంది.  ఇదే స్ఫూర్తితో వచ్చే సంవత్సరం సర్వేక్షన్ లో టాప్ టెన్ నగరాల్లో నిలబడడానికి కృషి చేస్తాం.

 

రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశనంలో ఆదర్శవంతమైన, పారదర్శక పాలనను అందిస్తూ సుస్థిరాభివృద్దిని సాధిస్తూ, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ఇది సాధ్యం అయ్యింది.

 

ఒడిఎఫ్ ++  లో మూడవసారి వరంగల్ మహా నగరం ఒడిఎఫ్ ++  తో 2020,2021, 2022 సంవత్సరాల్లో హ్యాట్రిక్ సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.