స్వయంఉపాధికి కల్పనకు కేసీఆర్ కృషి

స్వయంఉపాధికి కల్పనకు కేసీఆర్ కృషి

మరిపెడ, అక్టోబర్ 07,(జనం సాక్షి ):
రాష్టంలో స్వయంఉపాధి కల్పనకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారని డోర్నకల్ శాసనసభ్యులు డీ ఎస్ రెడ్యానాయక్ అన్నారు, శనివారం మున్సిపల్ కేంద్రంలోని ఆడిటోరియంలో బీసీ బంధు చెక్కులను జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు తో కలసి పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వయం ఉపాధికి తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయలు సహాయం 100 శాతం సబ్సిడీ తో ఇవ్వడం చాల గొప్ప విషయం అన్నారు, తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ రాష్టంలో లేని విదంగా సంక్షేమ పథకాలను అమలుచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్,మరిపెడ, డోర్నకల్ మున్సిపల్ చైర్మనులు గుగులోత్ సింధూర రవి నాయక్, వీరన్న,ఎంపిపి గుగులోత్ అరుణ రాంబాబు, మున్సిపల్ కమీషనర్ రాజు, జెడ్పిటిసి తేజావత్ శారద రవీందర్, వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చి రెడ్డి,నాయకులు బజ్జురి పిచ్చి రెడ్డి, వెంకట్ రెడ్డి, మురళిదర్ రెడ్డి,, మాజీ ఎంపిపి గుగులోత్ వెంకన్న,మున్సిపల్ కౌన్సిలర్లు బానోత్ కిషన్, విసరపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి,రేఖ లలిత వెంకటేశ్వర్లు, ,ఏడెల్లి పర్శరాములు,భయ్యా బిక్షం, ఊరుగొండ శ్రీను,బాధవత్ హతిరం, మాచర్ల స్రవంతి భద్రయ్య,కో ఆప్షన్ సభ్యులు షేక్ హుసైన్, మక్షుద్, ఆరు మండలాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.