స్వయం ఉపాధితో యువత అభివృద్ధి చెందాలి
-ఎంపిపి అధ్యక్షుడు మెరుగు బాలేశంగౌడ్
జగదేవ్ పూర్, అక్టోబర్ 22 (జనంసాక్షి):
స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని యువత అభివృద్ధి చెందాలని జగదేవ్ పూర్ ఎంపిపి అధ్యక్షుడు మెరుగు బాలేశంగౌడ్, మర్కూక్ మండల జెడ్పీటీసి సభ్యురాలు యెంబరి మంగమ్మ రాంచంద్రంలు పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రమైన జగదేవ్ పూర్ లో పలువురు యువకులు స్వంతంగా నెలకొల్పుకున్న టీ గార్డెన్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుకున్న నిరుద్యోగులు ఖాళీగా ఉండకుండా స్వయం ఉపాధిని ఎంచుకోవాలని సూచించారు. తల్లిదండ్రులకు భారంగా మారకుండా బాధ్యతగా మెదులుకొని ఆర్థికంగా స్వంతంగా ఎదగడానికి వివిధ వ్యాపారాలు నెలకొల్పుకొని విజయం సాధించాలని వివరించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొత్త లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపిటీసి కొత్త కవిత శ్రీనివాస్ రెడ్డి, ఎంపిటీసిల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, నాచారం దేవస్థానం డైరెక్టర్ బుద్ద నాగరాజు, ఎర్రవల్లి సర్పంచ్ మొండి భాగ్యబిక్షపతి, ఎంపిటీసి తుమ్మ ధనలక్ష్మి కృష్ణ, జగదేవ్ పూర్ మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఎంపిపి కో ఆప్షన్ సభ్యుడు ఏక్భాల్, టీ గార్డెన్ నిర్వహకులు నర్సిములు, దయానంద్, అజీజ్ పాషా, ఉప సర్పంచ్ కనకయ్య, నాయకులు మల్లేశం, వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కృష్ణా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.