స్వరాష్ట్రంలో జయశంకర్ సార్ లేకపోవడం బాధాకరం
– ప్రొఫెసర్ కోదండరాం
సికింద్రాబాద్‌లో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ నాలుగవ వర్థంతి కార్యక్రమంలో జేఏసీ ఛైర్మన్ కోదండరాంతోపాటు ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. జయశంకర్ సార్ ఆశయసాధన కోసం కృషిచేస్తామని చెప్పారు. తెలంగాణ కల సాకారం కోసం నిరంతరం తపించిన జయశంకర్ సార్.. రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. జయశంకర్ సార్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములమవుతామన్నారు.ఆయన చూపిన దారిలోనే తెలంగాణ రాష్ట్రం సాధించామన్నారు. 1969 ఉద్యమం నాటి నుంచి సార్ అలుపెరుగని పోరాటం చేశారన్నారు. తెలంగాణ సాధనలో పోరాడిర వారందరికి ఆయనే స్పూర్తి అన్నారు.