స్వర్ణకంచి షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవంలో రాధా రాజారెడ్డి నృత్య ప్రదర్శన
హైదరాబాద్, హైదరాబాద్‌లోని కొత్తపేటలో ఆదివారం నూతనంగా స్వర్ణకంచి పేరుతో షాపింగ్‌మాల్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ షాపింగ్‌మాల్‌ను ప్రఖ్యాత కూచిపూడి నృత్యకళాకారులు రాధా రాజారెడ్డి ప్రారంభించారు. ఈ మాల్‌లో పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు సరసమైన ధరలతో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా రాధా రాజారెడ్డి ప్రదర్శించిన నృత్యభంగిమలు, షాపింగ్‌మాల్‌లో నిర్వహించిన ఫ్యాషన్ షో అలరించాయి.