Janam Sakshi - Telugu Daily News Portal > జిల్లా వార్తలు > హైదరాబాద్ > వార్తలు > జాతీయం > స్వర్ణాలు సాధించిన భారత బాక్సర్లు / Posted on April 30, 2018
స్వర్ణాలు సాధించిన భారత బాక్సర్లు
ఢిల్లీ : సెర్బియాలో ఆదివారం జరిగిన బెల్గ్రేడ్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు స్వర్ణ పతకాలు సాధించారు. 91 కిలోల విభాగంలో సుమిత్ సంగ్వాన్, 51 కిలోల విభాగంలో నిఖాత్ ప్రత్యర్థులను చిత్తు చేశారు. ఆసియాన్ గేమ్స్‌లో వెండి పతకం సాధించిన సుమిత్ ఈక్వెడార్‌కు చెందిన కాస్టిలో టారెస్ను 5-0 తేడాతో ఏకపక్ష విజయం సాధించాడు. మరోవైపు నిఖాత్ సైతం గ్రీస్ దేశానికి చెందిన కంపోస్టోరోపౌలౌ ఐకటేనినిపై 5-0 తేడాతో విజయదుందుభి మోగించాడు. ఈ టోర్నమెంటులో భారత్ మొత్తం మూడు స్వర్ణాలు, ఐదు వెండి, ఐదు కాంస్య పతకాలు సాధించింది.