స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అవతారంలో దర్శనమిచ్చిన బతుకమ్మ కుంట దుర్గమ్మ ..

జనగామ (జనం సాక్షి)సెప్టెంబర్30 : జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట శ్రీ శ్రీ దుర్గాదేవి దేవాలయం లో అమ్మ వారికి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు దుర్గాదేవి ఆలయ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిట్టల సత్యం వాంకుడోత్ అనిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు . శుక్రవారం 5వ రోజు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వర్ణ కవచాలం కృత దుర్గాదేవి అవతారంలో దర్శనం ఇచ్చిన అమ్మవారు, ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు రాజలింగారాధ్య మాట్లాడుతూ ఈ రోజు మన దేవాలయంలో స్వర్ణ కవచాలం కృత దుర్గాదేవి అవతారంలో దర్శనం ఇచ్చారని వేదకాలంనుండి దేవీపూజ ఆచరణలో ఉన్నదనడానికి ఎన్నెన్నో ఆధారాలున్నాయి వేదాలలో శక్తి సంబంధమైన అనేక మంత్రాలున్నాయి వేదశాస్త్రాల, దృష్ట్యా అఖిల బ్రహ్మాండాన్ని నడిపించే మహా మహిమోపేతమైన శక్తి దేవీశక్తి దుష్టశిక్షణ శిష్టరక్షణ పరంగా బ్రహ్మాది దేవతలందరిచే నుతింపబడినది దేవీ ఆవిర్భావం దేవీ త్రిమూర్తి స్వరూపిణి ,సకలశక్తి సమన్విత, ధర్మార్థ కామమోక్ష ప్రదాత్రి భక్తులు ఏ ఇఛ్చతో ఆ తల్లిని ఆరాధిస్తే ఆయా మనోభీష్టాలను లను వారు అర్చించిన రీతిలోనే వారికి కనిపించి తీర్చగల అవతారమూర్తి అని ఈ సందర్భంగా వివరిస్తూ జనగామ ప్రజలు అందరు వచ్చి అమ్మ వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మ వారి కృపకు పాత్రులు అయ్యారని తెలిపినారు. భవాని మాల ధరించిన భక్తులకు దేవాలయం తరుపున ఆహారం ఏర్పాటు చేయడం గుడి కమిటికి అభినందనలు తెలిపిన భవాని మాతలు, దేవాలయ కమిటీకి భక్తులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపినారు.