*స్వర్ణ భారతి ట్రస్ట్ సేవలు అభినందనీయం*
కోదాడ జులై (జనం సాక్షి)
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు స్వర్ణ భారతి ట్రస్ట్ వారు చేయూతనందించడం అభినందనీయమని కోదాడ తహసీల్దార్ శ్రీనివాస్ శర్మ అన్నారు. బుధవారం పట్టణంలోని శ్రీనగర్ లో గల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పేద విద్యార్థులకునోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై స్థానిక వార్డు కౌన్సిలర్ కల్లూరి పద్మజాతో కలిసి పంపిణీ చేసి మాట్లాడారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో స్వర్ణ భారతి ట్రస్టు అగ్ర భాగాన నిలుస్తూ పేదలకు సేవ చేయడంచాలా మంచి ఆలోచన అని వేడుకల పేరిట డబ్బు వృధా చేయకుండా పేద ప్రజల కొరకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇంతటి మంచి కార్యక్రమాలు చేపడుతున్న స్వర్ణ భారతీయ ట్రస్ట్ సభ్యులను ఈ సందర్భంగా వారు అభినందించారు ఈ కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షులు గాదంశెట్టి శ్రీనివాసరావు, స్థానిక కౌన్సిలర్ కల్లూరి పద్మజ ,గౌరవ అధ్యక్షులు నీల సత్యనారాయణ ,ప్రధాన కార్యదర్శి ఇరుకుళ్లా చెన్నకేశవరావు, చారుగాండ్ల రాజశేఖర్, యాద సుధాకర్, గునుగుంట్ల సాయి, జితేంద్ర ప్రసాద్, రంగా కోటేశ్వరరావు ,పందిరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Attachments area
|
|