స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : అమెరికా, యూరప్‌, ఆసియా మార్కెట్ల ప్రభావంతో దేశీయ సూచీలు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ ఆరు పాయింట్లు లాభపడి 24,492 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఒక పాయింటు లాభంతో 7,438 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.68.02 వద్ద కొనసాగుతోంది.

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో ఎన్‌టీపీసీ సంస్థ షేరు ధర అత్యధికంగా 4.39 శాతం లాభపడి రూ.144 వద్ద ముగిసింది. వీటితోపాటు పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐడియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ సంస్థల షేర్లు లాభపడ్డాయి.

అలాగే బీహెచ్‌ఈఎల్‌ సంస్థ షేరు ధర అత్యధికంగా 4.06 శాతం నష్టపోయి రూ.139.35 వద్ద ముగిసింది. దీనితోపాటు అంబుజా సిమెంట్‌, ఏషియన్‌ పెయింట్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, హీరో మోటో కార్ప్‌ సంస్థల షేర్లు నష్టపోయాయి.