స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

4
ముంబయి : వరసగా మూడు రోజులుగా భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం మాత్రం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 39 పాయింట్లు లాభపడి 24,646 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 9 పాయింట్లు లాభపడి 7,485 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67.14 వద్ద కొనసాగుతోంది.

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ సంస్థ షేర్లు అత్యధికంగా 5.57శాతం లాభపడి 83.40 వద్ద ముగిశాయి. వీటితోపాటు బీహెచ్‌ఈఎల్‌, వేదాంత, ఎస్‌బీఐ, కోల్‌ ఇండియా సంస్థల షేర్లు లాభపడ్డాయి. అలాగే టెక్‌మహీంద్రా, హెచ్‌సీఎల్‌టెక్‌, ఐడియా, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మా సంస్థల షేర్లు నష్టపోయాయి.