స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిగా..
తెలంగాణ ఉద్యమాన్ని సాగిద్దాం
తెల్లదొరలను తరిమినట్లే సీమాంధ్ర పాలకులను తరుముదాం..
ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిద్దాం..
సెప్టెంబర్ 30న వెల్లువలా తరలిరండి..
తెలంగాణ మార్చ్’తో ఉద్యమ సత్తా చాటుదాం..
స్వాతంత్య్ర దినోత్సవాల్లో టీజేఏసీ చైర్మన్ కోదండరాం
హైదరాబాద్, ఆగస్టు 15 (జనంసాక్షి) : స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో తెలంగాణ ఉద్య మాన్ని సాగిద్దామని తెలంగాణ జేఏసీ చైర్మన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని జేఏసీ కా ర్యాలయంలో బుధవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో ఆయన జెండావిష్కరణ చేశారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ నాడు తెల్లదొరలను దేశం నుంచి తరమాల్సిన ఆవశ్యకత ఎంతుందో, నేడు సీమాంధ్ర పాలకులను కూడా తెలంగాణ నుంచి తరమా ల్సిన అవశ్యకత అంతే ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి సీమాంధ్ర మోసగాళ్లకు బుద్ధి చెబుదామన్నారు. నాడు తెల్లదొరలు వెళ్లిపోతేనే దేశంలో ఆకృత్యాలు, మారణకాండ, ప్రాణ త్యాగాలు తగ్గాయని, ఇప్పుడు కూడా సీమాం ధ్రులు వెళ్లిపోతేనే తెలంగాణ అభివృద్ధి చెందు తుందన్నారు. ఇంతకాలం తెలంగాణను అప్ప నంగా దోచుకున్న వారికి సమయం దగ్గర పడిం దని, రోజుకో రకంగా ఉధృతమవుతున్న ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం సీమాంధ్రుల గుండెల్లో దడ పుట్టిస్తున్నదని ఎద్దేవా చేశారు. ఆంగేయులు 200 ఏళ్లు దేశాన్ని
పాలించి, ఇక్కడి సంపదలను కొల్లగొట్టి, ఇక్కడి ప్రజా జీవనాన్ని నిర్వీర్యం చేస్తే, అంతకన్నా రెట్టింపు సీమాంధ్ర పాలకులు తెలంగాణను దోచుకున్నారని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. నాడు స్వాతంత్య్రం సాధించడానికి మార్గాలు సుగమం చేసిన క్విట్ ఇండియా ఉద్యమం తరహాలోనే, సెప్టెంబర్ 30న టీజేఏసీ ఆధ్వర్యంలో ‘తెలంగాణ మార్చ్’ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రజలు వెల్లువలా ఈ కవాతుకు తరలివచ్చి ఉద్యమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. తమ నినాదాలతో ఢిల్లీ పెద్దల గద్దెలు కదలిద్దామని ఉత్సాహపర్చారు. తెలంగాణ మార్చ్‌కు ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా పార్టీలకతీతంగా కదిలివచ్చి, యావత్ తెలంగాణకు తాము ప్రజాభీష్టానికి వ్యతిరేకం కాదని నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు.