స్వామి అగ్నివేష్‌పై బీజేపీ కార్యకర్తల దాడి

రాంచీ, జులై17(జ‌నం సాక్షి) : సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌(80)పై బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని పాకూర్‌లో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. లిట్టిపాడలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాకూర్‌కు స్వామి అగ్నివేష్‌ చేరుకున్నారు. అక్కడున్న ఓ ¬టల్‌లో స్వామి అగ్నివేష్‌ ఉన్నాడన్న విషయం తెలుసుకున్న బీజేపీ యువ మోర్చా, విశ్వహిందు
పరిషత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ¬టల్‌ నుంచి అగ్నివేష్‌ బయటకు రాగానే ఆయనపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఆయన బట్టలను చింపేశారు. నల్ల జెండాలను ప్రదర్శించిన ఆందోళనకారులు.. స్వామి అగ్నివేష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్వామి అగ్నివేష్‌.. క్రిస్టియన్‌ మిషనరీ సంస్థలతో చేతులు కలిపి.. జార్ఖండ్‌లోని గిరిజనులను క్రిస్టియన్లుగా మారుస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. దాడి జరిగిన అనంతరం స్వామి అగ్నివేష్‌ ఓ విూడియా సంస్థతో మాట్లాడుతూ.. తాను హింసకు వ్యతిరేకమని చెప్పారు. శాంతియుతంగా ఉండే వ్యక్తిని తాను అని పేర్కొన్నారు. తనపై దాడి ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని స్వామి అగ్నివేష్‌ తెలిపారు. అగ్నివేశ్‌ గతంలో హరియాణాలో ఎమ్మెల్యేగా పనిచేశారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం రాజకీయాలను వదిలేసి సామాజిక ఉద్యమాల్లోకి అడుగుపెట్టారు. ఆయన అన్నాహజారేతో కలిసి అవినీతిపై ఉద్యమించారు.