స్విట్జర్లాండ్‌ జంటపై దాడి ఘటలనపై స్పందించి సుస్మా

– యూపీ ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలని ఆదేశం

– బాధితులకు అన్ని విధాల సహకారంగా ఉంటమని వెల్లడి

ఢిల్లీ,అక్టోబర్‌26(జ‌నంసాక్షి) : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆగ్రా ప్రాంతంలో గత ఆదివారం ఓవిదేశీ జంటపై జరిగిన దాడిపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ స్పందించారు. ఈ ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలంటూ యూపీ ప్రభుత్వాన్ని కోరారు. ‘దాడి గురించి నాకు ఇప్పుడే తెలిసింది. దీనిపై యూపీ ప్రభుత్వాన్ని

నివేదిక అడిగాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత జంటను మా అధికారులు కలుస్తారు.’ అని సుష్మాస్వరాజ్‌ ట్వీట్‌ చేశారు. స్విట్టర్లాండ్‌కు చెందిన క్వెంటిన్‌ జెరెవిూ క్లెర్క్‌ తన ప్రేయసి మ్యారీ డ్రోజ్‌తో కలిసి సెప్టెంబర్‌ 30న భారత్‌ పర్యటనకు వచ్చారు. గత ఆదివారం వారు యూపీలో ఫతేపూర్‌ సిక్రీ రైల్వే స్టేషన్‌ సవిూపంలో నడుస్తుండగా.. కొందరు స్థానిక యువకులు దాడి చేశారు. వారిని వెంబడించి రాళ్లతో కొట్టారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో క్వెంటిన్‌, మ్యారీ గాయపడ్డారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి ఎందుకు చేశారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.