స్వీట్లు పంచిన భారత ఎంబెసీ

 

 

 

న్యూఢిల్లీ,నవంబర్‌13(జ‌నంసాక్షి): కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం దీపావళి పండుగను పురస్కరించుకుని గురువారం వివిధ పనులపై కార్యాలయానికి వచ్చిన భారత ప్రవాసులకు స్వీట్లు పంచిపెట్టింది. దీంతో కార్యాలయంలో దీపావళి వేడుకల కోలాహల వాతావరణం నెలకొంది. ఇక దీపావళిఆనందం, దీపాల పండుగ అనేది తెలిసిందే. అలాగే చీకటిపై కాంతి విజయానికి చిహ్నంగా, చెడుపై మంచి గెలుపుకు గుర్తుగా దీపావళి జరుపుకుంటాం. ఈసారి దీపావళి పండుగ ఈ నెల 14న వచ్చింది. దీంతో తమ పనుల నిమిత్తం ఎంబసీకి వచ్చిన భారత ప్రవాసులకు కార్యాలయం సిబ్బంది దీపావళి స్వీట్లు పంపిణీ చేసి వారిలో ఆనందాన్ని నింపింది. కాగా, దీపావళి నేపథ్యంలో వేడుకలు నిర్వహించి స్వీట్లు పంచిపెట్టిన ఎంబసీకి కమ్యూనిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.