స్వైన్‌ ఫ్లూతో వ్యక్తి మృతి

హైదరాబాద్‌,ఆగస్టు30: రాష్ట్రంలో స్వైన్‌ ఫ్లూ జాడలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ మహమ్మారి

కారణంగా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా స్వైన్‌ ఫ్లూ తో గాంధీ ఆస్పత్రిలో చిలకలగూడకు చెందిన గణెళిశ్‌ (65) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ నెల 28న స్వైన్‌ఫ్లూ లక్షణాలతో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ వ్యాధి లక్షణాలు మరో ఐదుగురిలో ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు స్వైన్‌ఫ్లూతో మృతిచెందిన వారి సంఖ్య 33కు చేరింది.