హక్కుల రక్షణ ఏఐటీయూసీికే సాధ్యం
కాకతీయఖని, జూన్ 16, (జనంసాక్షి) : ఎంతో కాలంగా సింగరేణి కార్మికుడికి వెన్నెముకగా పని చేస్తూ అనేక సమ్మెలు, ఉద్యమాలతో లెక్కలేనన్ని హక్కులను సాధించిన ఘనత, గత హక్కుల పరిర క్షణ కేవలం ఏఐటీయూసీ వల్లే సాధ్యమని వర్కిం గ్ ప్రెసిడెంట్ వై. గట్టయ్య అన్నారు. శనివారం స్థానిక కేటీకే 1వగని ఆవరణలో జరిగిన గేట్ మీ టింగ్‌కు ముఖ్య అతిథిగా హజరై మాట్లాడుతూ నూతన హక్కుల సాధన తమతోనే సాధ్యమౌతుం దని స్పష్టం చేశారు. గత నాలుగు సంవత్సరాలు గా ఏఐటీయూసీ కార్మికులకు సాధించిపెట్టిన హ క్కులన్ని వివరంగా బావులపై ప్లెక్సీ బోర్డులు ఏర్పా టు చేశామన్నారు. మిగతా సంఘాల వారు కార్మి కులకు ఏం చేశారో చెప్పకుండా ఏఐటీయూసీ ని విమర్శించినంత మాత్రాన గెలవలేరని పేర్కొన్నా రు. ఈ విషయంలో కార్మికవర్గం మెలకువగా ఉం డాలని రంగయ్య విజ్ఞప్తి చేశారు. తెలంగాణ జ పం చేసినంత మాత్రాన కార్మికవర్గ సమస్యలు ప రిష్కారం కావని, సమ్మెలు, ఉద్యమాలతో మాత్ర మే హక్కుల రక్షణ సాధ్యమని చెప్పారు. ముక్కలు చెక్కలైన ఐఎన్‌టీయూసీి, పనికిమాలిన హెచ్‌ఎం ఎస్, వేజ్‌బోర్డులో సభ్యత్వం లేని టీబీజీకేఎస్ సం ఘాలతో కార్మికులకు ఒరిగేదేమి లేదని వారి మా టలను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. సకల జనుల సమ్మెలో ఏఐటీయూసీిని పిలవకుండానే ఢిóిల్లీ వెళ్లి తిరిగి వచ్చి అర్థాంతరంగా సమ్మె విరమిం చి టీబీజీకేఎస్ నాయకులు కార్మికులకు ఏం సా ధించి పెట్టారో వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. అందువల్ల భూపాలపల్లి ఏరియా కార్మిక వర్గం బాగా ఆలోచించి కార్మికులను అన్ని విధాల ఆదుకుంటున్న ఏఐటియుసిని ఈ ఎన్నికల్లో కూడా గెలిపించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్ర మంలో కె. రాజ్‌కుమార్, ఎం. రమేశ్, జిల్లా తిరు పతియాదవ్, పుల్లయ్య, టి. నారాయణ, డి. తిరు పతి, రాంచెందర్ తదితరులు పాల్గొన్నారు.