హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలి

ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ఈదుల యాదగిరి
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): హక్కుల సాధన కోసం ముదిరాజులు ఐక్యంగా పోరాడాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ఈదుల యాదగిరి అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ , మాజీ రాజ్యసభ ఎంపీ బండా ప్రకాష్ ముదిరాజ్ జన్మదిన సందర్భంగా కోట మైసమ్మ గుడి ఆవరణలో కేకును కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో బండా ప్రకాష్ మంత్రివర్గంలో స్థానం సంపాదించి, ముదిరాజులను బిసి – డి నుంచి బిసి -ఏ కి మార్చే ప్రక్రియ ఆయన సారథ్యంలో జరగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ , ఆకుల కవిత లవకుశ, ఆకుల రాజేష్ , ఇండ్ల సురేష్ , అరిగే సైదులు, కోల నిరంజన్, గుంటి సైదులు, సారగండ్ల కోటయ్య , కోల నాగరాజు, దండు రేణుక , వీరయ్య , పావని , వెంకటయ్య , వెంకన్న , నాగరాజు, జానకి రాములు, లక్ష్మి , శబరి తదితరులు పాల్గొన్నారు.
Attachments area