హత్యకేసులో సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ అరెస్ట్
హైదరాబాద్, జనంసాక్షి: ఓ హత్యకేసులో సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్‌తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరు నక్సలైట్ల పేరుతో భూమి సెటిల్‌మెంట్లు కూడా చేస్తుంటారు. ఈ ముఠాలోని విజయ్ కిరణ్ అనే సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఉత్తర్‌ప్రదేశ్, రాయగడ్‌లలో తుపాకులు కొన్నట్లు కూడా తెలుస్తుంది.