హమాలీ రాష్ట్ర మూడో మహాసభను జయప్రదం చేయండి
తొర్రూర్ 31 ఆగస్టు( జనంసాక్షి )
సెప్టెంబర్ 4న ఖమ్మం నగరంలో జరుగు హమాలి, మిల్ వర్కర్స్ ఫెడరేషన్ మూడవ మహాసభను జయప్రదం చేయాలని ఆ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ పుల్లయ్య* అన్నారు. తొర్రూర్ లోని ఐఎఫ్టియు కార్యాలయంలో మూడవ మహాసభ పోస్టర్ను నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీల సంక్షేమ బోర్డు కావాలని కోట్లాదిమంది గొంతెత్తి అరిచిన పాలకులకు వినబడటం లేదాఅని అన్నారు. దేశ ప్రజలకు అవసరమయ్యే వస్తువుల ఎగుమతి దిగుమతిలో హమాలీ కార్మికులు చేస్తున్న కష్టం చిందిస్తున్న చెమట,శ్రమకు తగ్గ ఫలితం దక్కటం లేదని అన్నారు. అందుకే హామాలీలకు సమగ్ర చట్టం కావాలని కార్మిక పోరాటాలు చేయటానికే రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ మహాసభలకు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి 300 మంది ఏంపిక చేసిన ప్రతినిధులు హాజరవుతున్నరని రాష్ట్ర మూడో మహాసభలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను చర్చించనున్నామని అన్నారు. పిఎఫ్,ఈఎస్ఐ,పని భద్రత హక్కుకై పోరాడటానికి హమాలీ మిల్ వర్కర్స్ ఐక్యం కావలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పిలుపునిచ్చారు.ఇంకా ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పోడకంటి రామ్మూర్తి జిల్లా నాయకులు మంగళపల్లి సాయిలు వడ్లకొండ లక్ష్మణ్ తోరూరు అధ్యక్షుడు సిహెచ్ యాకయ్య, ఉపాధ్యక్షుడు రవి,బీమాతదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.