హరికేన్‌ ధాటికి అమెరికా అతలాకుతలం

యూఎస్‌,సెప్టెంబర్‌ 9,(జనంసాక్షి):సుమారు రెండురోజులుగా ఇర్మా, హరికేన్‌ ధాటికి అమెరికా విలవిలలాడుతున్నది. కుండపోత వర్షం, మరోవైపు భీకరమైన రాక్షస గాలులు కరీబియన్‌ దీవుల్లో విధ్వంసం సృష్టించాయి. 295 కిలోవిూటర్ల వేగంతో పెనుగాలు పెద్ద పెద్ద వృక్షాలను కూకటి వేళ్లతో పెకిలించేస్తున్నాయి. కరీబియన్‌ దీవుల నుంచి ఇర్మా ఫ్లోరిడా వైపు కదులుతున్నట్లు అమెరికా జాతీయ హరికేన్‌ కేంద్రం తెలిపింది. కరీబియన్‌ దీవుల్లో కేటగిరి 5 గా ఉన్న ఇర్మా ఫ్లోరిడా వైపు కుదులుతూ కేటగిరి 4గా మారి గంటకు 250 కి.విూల వేగంతో గాలులు విస్తాయని హెచ్చరించింది. మెక్సికో లో భూకంపం.. హరికేన్‌, ఇర్మా రెండు ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలను వణికిస్తున్నాయి. గురువారం మెక్సికో తీరంలో 8.2 తీవ్రతో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. టొబాస్కో, ఒక్సాకా, చైపాస్‌ రాష్ట్రాల్లో భూకంప ప్రభావం ఎక్కువగా ఉన్నది. ఈ రాష్ట్రాల్లో శిథిలాలను తొలిగించే ప్రక్రియలో అధికారులు ఉన్నారు. ఇంకా అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. భూకంపం వల్ల కనీసం 200 మంది గాయపడి ఉంటారని అధ్యక్షుడు ఎన్రిక్‌ నీటో తెలిపారు. ఈ ప్రాంతంలో 8.2 తీవ్రతతో భూకంపం రావడం ఈ శతాబ్ధంలోనే అత్యంత శక్తివంతమైనగా భావిస్తున్నారు. ఒక్క ఒక్సాకా రాష్ట్రంలోనే 45 మంది చనిపోయారు. చైపాస్‌లో మరో 12 మంది చనిపోయారు. మొత్తం ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 61 కి చేరుకున్నది. ఇక.. కరీబియన్‌ దీవులను దారుణంగా దెబ్బతీసిన హరికేన్‌ ఇర్మా ఇప్పుడు క్యూబాపై విరుచుకుపడింది. దీంతో అక్కడ అత్యంత బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కూడా నమోదు అయ్యాయి. అర్చిపెలాగో దీవిపైన కూడా ఇర్మా ప్రభావం చూపింది. అయితే ఇర్మా ట్రాక్‌ తప్పడంతో బహమాస్‌ దాదాపు భారీ విపత్తు నుంచి బయటపడింది. మరోవైపు అమెరికాలోని ఫ్లోరిడాపై ఇర్మా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. సుమారు 60 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ ఆదేశించారు. ఇర్మా వల్ల కరీబియన్‌ దీవుల్లో సుమారు 20 మంది మృతిచెందినట్లు అంచనా వేస్తున్నారు. దాదాపు కొన్ని దశాబ్ధాల తర్వాత అయిదవ ప్రమాద హెచ్చరిక కలిగిన హరికేన్‌ క్యూబాను తాకుతున్నది. ఇర్మా వల్ల గంటలకు 257 కిలోవిూటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. క్యూబాలోని కైబేరియన్‌ పట్టణానికి 190 కిలోవిూటర్ల దూరంలో ఇర్మా కేంద్రీకృతమైనట్లు తెలుస్తున్నది. ఒక వేళ ఇది తీరం దాటితే పెను విధ్వంసం రావడం ఖాయమని నాసా హెచ్చరించింది. ఇర్మా కదలికలను రికార్డును చేసిన నాసా శాస్త్రవేత్తలు.. ఫ్లొరిడా తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో సముద్రంలో హరికేన్‌ ఇర్మా కదలికలను నాసా రికార్డు చేసింది.