హరితవర్షి ఆత్మతహ్య కేసు

రికవారీ ఏజెంట్లను అరెస్ట్‌ చేసిన పోలీసులు
అమరావతి,ఆగస్ట్‌1 జ‌నంసాక్షిః ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో రికవరీ ఏజెంట్ల వేధింపులకు బలైన విద్యార్థిని హరిత వర్షిణి ఆత్మహత్య కేసులో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు మేనేజర్లు, నలుగురు రికవరీ ఏజెంట్లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. హర్షిణీ తండ్రి రెండు క్రెడిట్‌ కార్డుల ద్వారా ఆరులక్షల రూపాయలను వాడుకున్నాడని పోలీసులు వివరించారు. వాటిని వసూలు చేయడానికి నిర్వాహకులు ఇంటికి వెళ్లారు. ఆసమయంలో తండ్రి ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులపై రికవరీ ఏజెంట్లు చట్ట విరుద్ధంగా ప్రవర్తించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన కూతురు హరిత వర్షిణి సుసైడ్‌ నోట్‌రాసి ఆత్మహత్యకు పాల్పడిర దని వివరించారు. విజయవాడలోని మొగల్‌రాజ్‌పురంలో కాల్‌సెంటర్‌ ఏర్పాటు ఏర్పాటు చేసుకుని వినియోగదారుల నుంచి రికవరీ చేస్తున్నారని తెలిపారు.
హరిత వర్షిణి తల్లి ఫిర్యాదు మేరకుకేసు నమోదు చేసుకుని ఏడుగురు నిందితులను అరెస్టు చేశామని వెల్లడిరచారు. రికవరీ ఏజెంట్లు ఆర్‌బీఐ గైడ్‌లైన్‌ ప్రకారమే నడుచుకోవాలని, అవమానపరిచే విధంగాని దాడులకు గాని పాల్పడవద్దని తెలిపారు. హరిత వర్షిణి తల్లి ఫిర్యాదు మేరకుకేసు నమోదు చేసుకుని ఏడుగురు నిందితులను అరెస్టు చేశామని వెల్లడిరచారు. రికవరీ ఏజెంట్లు ఆర్‌బీఐ గైడ్‌లైన్‌ ప్రకారమే నడుచుకోవాలని, అవమానపరిచే విధంగాని దాడులకు గాని పాల్పడవద్దని తెలిపారు.