హరితహారంకు సిద్దం అవుతున్న యంత్రాంగం

కామారెడ్డి,జూన్‌18(జ‌నం సాక్షి): నాలుగోవిడత హరితహాం కోసం పెద్ద ఎత్తున మొక్కలు సిద్దం చేశామని కలెక్టరక్టర్‌ సత్యనారాయణ అన్నారు. మొక్కల పెంపకానికి చర్యలు తసీఉకున్నామని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. మాట్లాడుతూ మొక్కలు నాటి వదిలేయకుండా వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతో పాటు ప్రభుత్వం ఎన్నో వసతులు కల్పిస్తోందని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇదిలావుం/-టే ఇంటింటికీ తాగునీటిని అందించాలనే సంకల్పంతో చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం పనులు వేగవంతంగా కొనసాగున్నాయి. అన్ని గ్రామాలకు తాగునీటిని అందించడానికి ట్యాంకుల నిర్మాణం చేసి నీటి సరఫరాకు అధికారులు ప్రత్యేకచర్యలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా ఇప్పటికీ రెండుమార్లు నీటి సరఫరాకు ట్రయల్‌ రన్‌ ట్రయల్న్‌ చేశారు. గ్రామాల్లో ఉన్న పాతట్యాంకుల ద్వారానే నీటిని సరఫరా చేయడానికి ఇప్పటికే పైపులైన్‌ వేయడానికి పనులు జరుగుతున్నాయి. దశలవారీగా ట్రయల్న్‌ చేస్తుండటం, త్వరలోనే ఆయా ట్యాంకులను నీటిని సరఫరా చేసిప్రజలకు నీటిని అందించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి.