హరితహారంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి
కామారెడ్డి, జూలై2(జనం సాక్షి): హరితహారాన్ని సామాజిక ఉద్యమంగా ముందుకు సాగాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. రానున్న నాల్గో విడత హరితహారానికి ప్రతీ గ్రామంలో గుంతలను తవ్వి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంస్థలు, పెట్రోల్ బంకులు, గ్యాస్, రైస్ మిల్లర్లు తమ పరిసరాల్లో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతాయని, కాలుష్యాన్ని నివారించి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను, భవిష్యత్తు తరాలకు విలువైన సంపదను అందజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి మొదటి సంవత్సరం అన్ని ప్రభుత్వసంస్థల్లో అమలు చేసిందని, రెండో విడత విద్యార్థుల ద్వారా, మూడో విడత విద్యార్థులు, కమ్యూనిటీల ద్వారా చేపట్టినట్లు గుర్తు చేశారు. కొత్తగా ఏర్పాటు అయిన జిల్లాలో సవిూకృత కలెక్టరేట్ భవనాన్ని మొక్కలతో సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో, మాల్తూమ్మెదలో రాశివనాన్ని ఏర్పాటు చేయడంపై ప్రజలు హర్షిస్తున్నారని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కడెం నుంచి విలువైన మొక్కలను జిల్లాకు స్వచ్ఛందంగా తెప్పించి నాటించామన్నారు. జిల్లాలో 133 నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నట్లు వివరించారు. వాల్టా చట్టం 2005 ద్వారా 300 చదరపు గజాల ఇంటిలో కనీసం 5 మొక్కలను నాటాలని సూచించారు. దీనిని ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. మొక్కలు తప్పకుండా 33 శాతం ఉండేవిధంగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందన్నారు. ప్రతి రైస్ మిల్లర్, గ్యాస్, పెట్రోల్ బంకు యాజమాన్యాలు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని హరితహారంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. చెట్లు అధికంగా ఉన్న జుక్కల్‌లో ప్రస్తుతం 165 మిల్లీవిూటర్ల వర్షపాతం నమోదు అయ్యిందని చెప్పారు. గాంధారి, బాన్సువాడ, మద్నూర్ మండలాల్లో హరితహారంలో చక్కటి వాతవారణం అందిస్తుందన్నారు.