హరితహారంలో ముందున్న జిల్లా
జోరుగా సాగుతున్న మొక్కల యజ్ఞం
ఆదిలాబాద్,ఆగస్ట్3(జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలోనిర్ణీత లక్ష్యాన్ని అధిగమించి జిల్లా ముందంజలో నిలిచేలా సాగుతోంది. జిల్లాలో నాలుగు కోట్ల మొక్కలను నాటాలనేది ప్రభుత్వ లక్ష్యంకాగా దానిని అధిగమించేలా అధికారులు కృషి చేస్తున్నారు. కలెక్టర్ దివ్యదేవరాజన్ ఆదేశాలతో పాటు మంత్రి జోగురామన్న తరచూ సవిూక్షలతో ఎక్కడిక్కడ మొక్కల యజ్ఞం సాగుతోంది. జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించాక గత మూడు విడతల్లో లక్ష్యాన్ని పూర్తిచేసుకుని రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానంలో నిలిచిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాకలెక్టర్ సారధ్యంలో గ్రామస్థాయినుంచి జిల్లాస్థాయివరకు అన్ని శాఖల అధికారులను సమన్వయ పరుస్తూ పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జిల్లాస్థాయి అధికారులతో పలు సమావేశాలు నిర్వహించడంతో గ్రామ మండల నియోజకవర్గ స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించడంతోపాటు గ్రామ మండల నియోజకవర్గ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి సవిూక్షిస్తూ సిబ్బంది, అధికారులను ఉత్తేజితం చేయడమేకాక ప్రజలను కూడా భాగస్వామ్యం చేశారు. దీంతొ జిల్లాలో హరితహారం గతేడాది ఉద్యమంలా సాగి నిర్ణీత గడువులోగా లక్ష్యాలను పూర్తి చేసింది. దీంతో ఈ యేడు కూడా అందుకు అనుగుణంగా సాగుతున్నాఉన ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున ప్లాంటేషన్ చేపట్టారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలతో పాటు రోడ్లకు ఇరువైపేలా మొక్కలు నాటడం జరిగింది. అంతేకాకుండా రైతుల పొలం గట్లపై కోటిన్నర టేకు మొక్కలు నాటనున్నారు. మొక్కలను నాటడమేకాదు వాటి సంరక్షణపై కూడా జిల్లాకలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. మొక్కల సంరక్షణ పర్యవేక్షణ కోసం జియోట్యాగింగ్ చేసి ఎప్పటికప్పుడు వాటిని సంరక్షణ పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. జియో ట్యాగింగ్ పై అధికారులకు ప్రత్యేకంగా శిక్షణా తరగతులు నిర్వహించారు. నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ అధికారులను ఆదేశించారు.