హరిత సూర్యాపేటగా తీర్చిదిద్దాలి

– డిఎస్పీ నాగభూషణం
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): హరిత సూర్యాపేటగా తీర్చిదిద్దాలని డిఎస్పి నాగభూషణం అన్నారు.మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్బీఐ ఆర్ఎం కృష్ణమోహన్ ఆధ్వర్యంలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వాలంటీర్స్ సహకారంతో నిర్వహించిన వన ప్రేరణ మహోత్సవ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మొక్కలు నాటి మాట్లాడారు.విద్యార్థి దశ నుండే మొక్కల పెంపకాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి పరిరక్షించడం బాధ్యతగా చేసుకోవాలన్నారు.పర్యావరణ సమతుల్యత  కొరకు మొక్కలు నాటడం అనివార్యమన్నారు.
Attachments area