హరిత హారంలో 4.18 కోట్ల మొక్కలు నాటాలి-కలెక్టర్‌ నీతూప్రసాద్‌

కరీంనగర్‌,మార్చి31(జ‌నంసాక్షి): హరితహారం పథకంలో రెండవ విడత 4.18 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు జిల్లాకలెక్టర్‌ నీతూప్రసాద్‌ తెలిపారు.  కలెక్టర్‌ హరితహారంపై ఎపిఓలు, DC-Neetu-Kumari-Prasadఎంపిడిఓలతో సవిూక్షించారు. ఈసందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గత సంవత్సరం నర్సరీలలో మిగిలిన మొక్కలలొ 1 విూటరు కంటే ఎక్కువగా పెరిగిన వాటిని పెద్ద బ్యాగులోకి మార్చాలని తెలిపారు. ఇందిర జలప్రభ కింద కరెంట్‌ కనెక్షన్‌ మంజూరైన అన్ని బ్లాకులలోను వెంటనే మోటార్లు బిగించాలన్నారు. 14వ ఫైనాన్స్‌ నిధులలో 30శాతం నిధులను తప్పనిసరిగా తాగునీటి స్కీంకు చెందిన కరెంట్‌ చార్జీలు

చెల్లించాలన్నారు. ఉపాధి హామిలో పెండింగ్‌లో ఉన్న 10వేల ఐఎస్‌ఎల్‌ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ క్రింద లేదా స్వచ్చభారత్‌ కింద అన్ని గ్రామాలలో ఐఎస్‌ఎల్‌ చేపట్టామన్నారు. ఓడీఎఫ్‌కాని గ్రామంలో కూడా పనులను మంజూరు చేయించాలన్నారు. జిల్లా ప్రథమ స్థానంలో నిలబడే విదంగా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. హుస్నాబాద్‌, చొప్పదండి ధర్మపురి, మంథని మండలాల్లో ఐఎస్‌ఎల్‌ నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. నిర్మాణం పూర్తయిన ఐఎస్‌ఎల్‌లకు వెంటనే చెల్లింపులు జరుపాలన్నారు. చిన్న చిన్న విషయాలలో పెండింగ్‌లో పెట్టవద్దన్నారు. ప్రజలలో అవగాహన కల్పించి ఐఎస్‌ఎల్‌ నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. మరుగుదొడ్లను నిర్మాణం చేయడమే కాకుండా  వాటిని ఉపయోగించుకునే విదంగా అవగాహన కల్పించాలన్నారు. ఉపాధి హామి చెల్లింపులు జరగాల్సి ఉన్న పాత బకాయిలను చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈకార్యక్రమంలో డీఎఫ్‌ఓలు, ఎపిఓలు, ఎంపిడిఓలు పాల్గొన్నారు.