హరిత హారం లక్ష్య సాదనలో జిల్లా రికార్డు
-వందశాతం త్వరగా లక్ష్యం సాదించిన మూడో జిల్లాగా గుర్తింపు
-ఉమ్మడి జిల్లాలో అగ్ర స్థానం
-కలెక్టర్ డి కృష్ణభాస్కర్
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 8 (జనంసాక్షి):మూడోవిడత తెలంగాణాకు హరితహారంలో జిల్లా రికార్డు నెలకొల్పింది. రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత హరితహారంలో జిల్లాకు 80 లక్షల మొక్కలు నాటే లక్ష్యంను ప్రభుత్వం నిర్దేశించింది. ప్రజాబాగన్వామ్యం రాష్ట్ర మంత్రి కేటీఆర్ మార్గదర్శనం, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్‌కర్ ప్రత్యేక చొరవతో జిల్లా ఈనెల 7వతేదీ నాటికి80లక్షల 48వేల మొక్కలను జిల్లా వ్యాప్తంగా నాటి రికార్డు సృష్టించింది, రాష్ట్ర వ్యాప్తంగా మూడోవిడత హరితహారం కింద నిర్దేశించిన లక్ష్యంను వేగంగా సాదించిన మూడో జిల్లాగా సాదించిన రాజన్న సిరిసిల్ల ప్రత్యేకతను చాటుకుంది. తొలి, రెండవ జిల్లాలుగా ఖమ్మం, వరంగల్ గ్రావిూణం జిల్లాలు నిలిచాయి. ఉమ్మడి జిల్లాలో వందశాతం లక్ష్యంను సాదించిన తొలి జిల్లాగా రాజన్న సిరిసిల్ల నిలిచింది. 80శాతం లక్ష్యంను సాదించి జగిత్యాల జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 12వ స్థానంలో కొనసాగుతుండగా పెద్దపల్లి 76శాతం లక్ష్య సాదనతో రాష్ట్ర వ్యాప్తంగా 14 వ స్థానంలో కొనసాగుతుంది. ఇక కరీంనగర్ జిల్లా 54 శాతం మాత్రమే శుక్రవారం నాటికి సాదించి రాష్ట్రవ్యాప్తంగా 28వ స్థానంలో నిలిచింది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం కరీంనగర్ చివరి స్థానంలో ఉంది. వందశాతం లక్ష్యం సాదించిన తొలి మూడు జిల్లాల్లో రాజన్నసిరిసిల్లకు చోటు లభించడంపై జిల్లాకలెక్టర్ కృష్ణభాస్కర్ ట్విట్టర్‌లో స్పందించారు. ప్రజాప్రతినిధుల ప్రత్యేక చొరవ ప్రజాబాగస్వామ్యం అధికారులు ఉద్యోగుల సమన్వయం వల్ల జిల్లా త్వరితగతిన వందశాతం లక్ష్యసాదన చేదించిన 3వ జిల్లాగా నిలించిందన్నారు. ఇదే స్పూర్తితో మొక్కల సంరక్షణకు నడుం బిగిస్తున్నాయన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించడం లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. లక్ష్యసాదనలో భాగస్వామ్యం అయన ప్రతి ఒక్కరికి దన్యవాదాలు కలెక్టర్ తెలిపారు. జెసి యాస్మిన్‌భాషా మాట్లాడుతూ హరితహారంలో 100శాతం లక్ష్య సాదించడం సమిష్టి విజయమన్నారు.