హరీశ్‌కు సమాచార శాఖ?
ఖడ్ ఎన్నికల ఫలితాల తరువాత అప్పగించనున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్,ఫిబ్రవరి 14(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు మరో బాధ్యత అప్పగించనున్నారని తెలుస్తోంది. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో తెరాసక పార్టీ ఘనవిజయం ఖాయమని వివిధ ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించిన హరీశ్ రావుకు మరో ముఖ్య శాఖను సీఎం కెసిఆర్ అప్పగించవచ్చునని అంటున్నారు. నారాయణఖేడ్ ఫలితాలు రాగానే హరీశ్ రావుకు సమాచార, పౌర సంబంధాల శాఖను అప్పగించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో విజయం అనంతరం… ప్రచార బాధ్యతలు చేపట్టిన మంత్రి కెటి రామారావుకు కీలకమైన మునిసిపల్ శాఖను కెసిఆర్ అప్పగించారు. ఇదే సమయంలో కేటీఆర్, హరీష్ రావులను సమానంగా చూడాలంటే మరో శాఖను అప్పగించాలని కొందరు నేతలు కెసిఆర్ దగ్గర అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. ఊజీతీతిబష్ట్ర ఖీజీనీ బవబి బినీ ణవబి ఎడఖఖీ తీవబజూనీనిబతిపతిశ్రీతిబివ తన వద్ద ఉన్న శాఖలను పంచుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలన్న ఆలోచనలో ఉన్న ఆయన సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. దీంతో హరీశ్ రావుకు కూడా ప్రమోషన్ దక్కుతుందని అంటున్నారు. కాగా, నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో తెరాస 70వేల మెజార్టీతో గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. రెండో స్థానం కోసం కాంగ్రెస్, టిడిపిలు పోరాడాయి. అయితే ఆ పార్టీలకు డిపాజిట్లు కూడా కష్టమేననే వాదనలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి మంత్రంతో హరీష్ రావు ఓటర్లను ఆకట్టుకున్నారు.