హలో ట్రంప్… మోదీ
` కరోనా వైరస్ నివారణపై ఫోన్లో సంభాషణ
న్యూఢల్లీి,ఏప్రిల్ 4(జనంసాక్షి):కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్నక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ టెలీఫోన్ సంభాషణ జరిపారు. కరోనాను కట్టడి చేసేందుకు ఇద్దరి మధ్య సుధీర్ఘ చర్చ జరిగింది. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ సోషల్ విూడియా ద్వారా తెలిపారు. కరోనాపై పోరులో కలిసికట్టుగా సర్వశక్తు ఒడ్డేందుకు నిర్ణయించుకున్నట్లు ప్రధాని వివరించారు. ట్రంప్ తో సుధీర్ఘంగా సాగిన చర్చలో ఇరుదేశా భాగస్వామ్యంతో కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు నిర్ణయించామన్నారు. కాగా కరోనా దెబ్బకు అమెరికా వివిల్లాడుతున్నది. ఇప్పటి వరకు అక్కడ 2.79 క్ష మంది కరోనా బారిన పడగా.. 7,451 మంది ప్రాణాు కోల్పోయారు. మరోవైపు భారత్‌లో కూడా కరోనా కేసు ఒక్కసారిగా పెరిగాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3,072 మంది కరోనా బాధితు సంఖ్య చేరగా…75 మందికి పైగా చనిపోయారు.