హవ్వా ! అక్కడ డెబ్బై శాతం మహిళలకు మరుగుదొడ్లే లేవు
అభివృద్ధి ఆనవాల్లే లేవక్కడ
సీఎం , మంత్రుల ప్రచారం అవాస్తవం, రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం
అనంతపూర్ సూకీ పర్యటనపై జయరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, డిసెంబర్ 15 (జనంసాక్షి) :
రాష్ట్రం అభివృద్దిపథంలో పయనిస్తోందని ముఖ్య మంత్రి, మంత్రులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్రమంత్రి జైరాం రమేష్ కుండబద్దల గొట్టరు. ఈ విషయం ఎవరో చెబితే తెలుసు కున్నది కాదని తానే స్వయంగా విచారించి తెలటు సుకున్నానన్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి సమావేశంలో మాట్లడుతూ పై వాఖ్యలు చేశారు. నేను అనంతపూరు జిల్లాలో పర్యటించిన సమయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వేదికనూ మాట్లాడుతూరాష్ట్రం ఎంతో అభివృద్ది సాధించిదని ప్రసంగించారు. మంత్రి రఘువీర రెడ్డి కూడా అదే తరహాలో ఉపన్యాసించారు. సమావేశానికి హాజరైన స్వయం సహాయక గ్రూపుల్లోని పదిమంది మహిళల్ని మీ ఇంట్లో మరురుగు దొడ్ల ఉన్నాయా అని ప్రశ్నించగా వారిలో ఏడు మంది లేవనే సమాధానం చెప్పారు.అంటే డభైశాతం మందికి మరుగుదొడ్లే లేవన్న మాట. మహిళలకు మరుగు దొడ్లే లేనప్పుడు ఇక అభివృద్ది ఎలా ఉంటుంది. అని జయ రాం రమేష్ అన్నారు.
మహిళలు బహిరంగ ప్రదేశాల్లో వెళ్లినంత కాలం సమాజం అభివృద్ధి చెందనట్లేనన్నారు. హర్యాన లో మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా మరుగుదొడ్డి లేని ఇంటికి ఆడ పిల్లలను ఇచించ పెళ్లి చేసేందుకు నిరాకరించాలని మంత్రి జయరాం రమేష్ సూచించారు. కాగా దేశంలో పలు గ్రూపు సభ్యులు ఇలాంటి సమస్య పై దృష్టి సారించి మాజిక సేవకు తమ వంతు సహకారం అందించాలని మంత్రి కోరారు.