హవ్వా..! ఇదేం బువ్వ ఈ బువ్వ మా కొద్దు
సెంటినరికాలనీ, జులై 27 (జనంసాక్షి) : పెద్దపల్లిలోని జేఎన్‌టీయూ వసతిగృహంలో అందిస్తున్న భోజనం నాసిరకంగా ఉందంటూ సెంటి నరికాలనీ జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ విద్యార్థులు శుక్రవారం ఆం దోళనకు దిగారు. ఇదే విషయమై గతంలో రెండుమార్లు ధర్నా చేపట్టి న అధికారులు పట్టించుకోకపోవడంతో మరోసారి విద్యార్థులు కన్నెర్ర చేశారు. ఆందోళనను ఉధృతం చేశారు. కళాశాల ముందు భైఠాయించారు. కార్యనిర్వాహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. మధ్యాహ్నం కూడా భోజనం ముట్టుకోకుండా ధర్నాను విద్యార్థు లు కొనసాగించారు. కళాశాల ప్రిన్సిపాల్ చంద్రలింగం, ఇతర అధ్యా పకులు విద్యార్థులను ఎంత నచ్చచెప్పినప్పటికి మొండికేశారు. జేఎన్ టీయూ వైస్‌ఛాన్స్‌లర్ ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చేంత వరకు తమ ఆందోళనను విరమించేది లేదని విద్యార్థులు తేల్చి చెప్పా రు. దీంతో జేఎన్‌టీయూ క్యాం పస్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెల కొంది. సుమారు 200మంది నిరాహార దీక్ష చేపట్టడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. పరిస్థితిని చక్కదిద్దేంత వరకు కళాశాల కార్యనిర్వాహక వర్గం చేసిన ప్రయ త్నాలు విఫలమయ్యాయి. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న పలు వురు విద్యార్థులు మాట్లాడుతూ జేఎన్‌టీ యూ వసతిగృహంలో ఇచ్చే భోజనం నాసిరకంగా ఉంటున్నదని బోరింగ్‌లు కూడా సక్రమంగా లేకపోవడంతో స్నానాలకు కూడా నీరు అందడం లేదన్నారు. హాస్టల్‌లో నిత్యం అపరిశుభ్రత తాండవిస్తున్నదన్నారు. ఇదిలా ఉంటే కళాశాలలో ఫ్యాకల్టీ కూడా సరియగు రీతిలో లేదన్నారు. విద్యా ర్హతలు లేని ఫ్యాకల్టీచే బోధన చేయించడం బాధకరమన్నారు. లైబ్రరీ, ల్యాబ్స్ పరిపుష్టిగా లేదన్నారు. విద్యార్థులకొచ్చిన స్కాలర్‌షిప్పులను ప్రిన్సిపాల్ ఇంతవరకు ఇవ్వడం లేదన్నారు. అనేకరకాలుగా కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపిం చారు. క్రమశిక్షణ చర్యలను తీసుకుంటానని హెచ్చరిస్తున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ విధి నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని, ఆయన స్థానంలో మరొకరిని జేఎన్‌టీయూ నియమించాలని డి మాండ్ చేశారు. జేఎన్‌టీయూ వైఎస్‌ఛాన్స్‌లర్ తమకు హామీ ఇచ్చేం తవరకు దీక్ష విరమించేది లేదని పేర్కొన్నారు. కాగా, విద్యార్థులు ఉదయం నుంచి చేపట్టిన నిరాహార దీక్ష క్రమంలో ఆందోళన నిర్వ హిస్తున్న ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రత్యూష, అపర్ణ, మంజుల, ప్రియాంక, క్రాంతి, అశోక్‌లు అస్వస్థతకు గురి కాగా, తోటి విద్యార్థులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఉద్రిక్తతంగా ఉండటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. టూటౌన్ సీఐ ఆర్.ప్రకాష్ సంఘటన స్థలానికి వచ్చి విద్యార్థులకు నచ్చచెప్పిన, వినలేదు.