హస్తినకు చేరుకున్న సీఎం కేసీఆర్‌

3

హైదరాబాద్‌  మే 6 (జనంసాక్షి):  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం 8.30 గంటల సమయంలో హస్తిన బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పయనం అయ్యారు. సీఎం వెంట సీఎస్‌ రాజీవ్‌శర్మ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌ ఉన్నారు. రేపు మధ్యాహ్నం కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌తో సీఎం కేసీఆర్‌ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా జింఖానా మైదానం, పోలో మైదానం గురించి చర్చించనున్నారు.  నేడు మధ్యాహ్నం కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌తో భేటీ అవుతారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ను మరో ప్రాంతానికి తరలించే అంశంపై ఆయనతో చర్చిస్తారు. గతంలో శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన కంటోన్మెంట్‌ నగరం విస్తరించడంతో ప్రస్తుతం నగరం మధ్యకు చేరింది. దీంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయాలను కేంద్ర రక్షణ మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్తారు. కేంద్రం అనుమతిస్తే కంటోన్మెంట్‌ మరో చోటుకు తరలింపునకు అవసరమైన ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని స్పష్టం చేయనున్నారు. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైనిక్‌స్కూల్‌ ఏర్పాటు విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించి, ఈసారి వరంగల్‌కు సైనిక్‌స్కూల్‌ మంజూరు చేయాలని కోరనున్నారు.