హామీలను నెరవేర్చి,చనిపోయిన వీఆర్ఏ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి…

వీఆర్ఏ జేఏసీ జిల్లా చైర్మన్ బెజ్జం భరత్ కుమార్
కేసముద్రం సెప్టెంబర్ 11 జనం సాక్షి / తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ విఆర్ఏ లు 48 రోజులుగా కొనసాగిస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా 2 నెలలుగా జీతం లేక ఆర్ధిక ఇబ్బందుల వల్ల మనస్తాపం చెందిన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన వీఆర్ఏ కంచర్ల వెంకటేశ్వర్లు ఇంట్లో ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది.ఈ సందర్భంగా విఆర్ఏ మహబూబాబాద్ జిల్లా చైర్మన్ బెజ్జం భరత్ కుమార్ చనిపోయిన విఆర్ఏ వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను ఆదివారం వారి ఇంటి వద్ద కలిసి పరామర్శించారు.ఈసందర్భంగా భరత్ మాట్లాడుతూ… ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 28 మంది  వీఆర్ఏలు చనిపోగా ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని ఇది సరి కాదని,వెంకటేశ్వర్లది ఆత్మహత్య కాదని ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ,చనిపోయిన విఆర్ఏ కుటుంబంను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని వారి కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, వారి కుటుంబానికి 50000 లక్షల రూపాయలు ప్రకటించాలని ప్రభుత్వన్నీ కొరినారు. లేని పక్షంలో విఆర్ఏ లందరు పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం జేఏసీ కో చైర్మన్ గుండెల బుచ్చయ్య ,కన్వీనర్ ప్రభాకర్,ఐలేష్,సమ్మయ్య, భాస్కర్, మంగిలాలు, ఎర్రయ్య,సారయ్య పాల్గొన్నారు.