హామీలు అమలు చేయాలి

– జిల్లా నాయకులు శ్రీనివాస్

డోర్నకల్ జూలై 26 జనం సాక్షి

ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన ప్రకారం పేస్కేల్ వెంటనే అమలు చేయాలని కోరుతూ డోర్నకల్ మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న నిరవధిక సమ్మె రెండోవ రోజుకు చేరింది.సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం,సిఐటియు మద్దతు పలికింది.వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఉప్పరపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వీఆర్ఏలందరికీ పేస్కేల్‌ ఇస్తామని,వయసు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని నిండు అసెంబ్లీలో 20 నెలల క్రితం సీఎం కేసీఆర్‌ ప్రకటించినా నేటికీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అర్హులైన వీఆర్ఏలకు వెంటనే పదోన్నతులు కల్పించాలని,అందరికీ సొంత గ్రామాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.విధుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించాలని కోరారు.లేనియెడల తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి మల్లేశం,వీఆర్ఏలు మండలాధ్యక్షుడు అలేటి బాలకృష్ణ,ఉపాధ్యక్షుడు సురేష్,యాదగిరి,గోపరాజు,సాయి రామ్,చంద్రశేఖర్,నాగుల్ మీరా,భారతి,కవిత, డానియల్,రామకృష్ణ తదితరు పాల్గొన్నారు.