హామీలు నిలబెట్టుకుంటాం

1

– బస్తీబాట పట్టిన కేటీఆర్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి 6(జనంసాక్షి): గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హావిూలను అమలు చేస్తామని మంత్రి కెటి ఆరమారావు హావిూ ఇచ్చారు. గ్రేటర్‌ ఎన్నికల్లో అపూర్వ విజయం కట్టబెట్టిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్‌ పద్మారావునగర్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ శనివారం పర్యటించారు. ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పుకునేందుకు ఈ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రేటర్‌ ఎన్నికల్లో విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన హావిూలు నెరవేరుస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. సీఎం కేసీఆర్‌ సూచనతో బల్దియాలో గెలిచిన

వెంటనే కాలనీల్లో పర్యటిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. పేదలందరికీ 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. బస్తీ వాసులకు 6 నెలల్లో రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తామన్నారు. హైదరాబాద్‌ నగరంలో లక్ష రెండు పడకగదుల ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా తెరాస ప్రణాళికలో పొందుపరిచిన హావిూలన్నీ  తప్పకుండా అమలు చేసి తీరుతామని  మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. గ్రేటర్‌ ఫలితాలతో రాజకీయ పార్టీలకు దిమ్మ తిరిగిందన్నారు. ఈ విజయాన్ని అందించిన సనత్‌నగర్‌ నియోజకవర్గ ప్రజలందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. శనివారం పశ్చిమ మారేడుపల్లిలోని తన నివాసంలో గ్రేటర్‌ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి ఫలితమే టీఆర్‌ఎస్‌ను గెలిపించిందని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ అభివృద్ధి ఫలితం మనల్ని గెలిపించింది. ప్రజలు చూపిన ఆదరణ మనపై మరింత బాధ్యతను పెంచింది.

కార్పొరేటర్లందరికీ మిఠాయిలు తినిపించి తలసాని అభినందనలు తెలిపారు. కార్పొరేటర్లు ఆయా డివిజన్లలో తిరిగి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేయాలని సూచించారు.