హార్ధిక్‌ పటేల్‌కు బెయిల్‌

అహ్మదాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): ఎమ్మెల్యేపై దాడి కేసులో పటేల్‌ వర్గ నాయకుడు హర్దిర్‌ పటేల్‌కు గురువారం బెయిల్‌ మంజూరైంది. రూ. 5వేల పూచికత్తుపైన గుజరాత్‌లోని విసనగర్‌ కోర్టు హర్దిక్‌కు బెయిల్‌ ఇచ్చింది. హార్దిక్‌ పటేల్‌పై బుధవారం అరెస్టు వారెంట్‌ జారీ అయిన విషయం తెలిసిందే. 2016లో విసనగర్‌లోని మెహసనా ప్రాంతంలో భాజపా ఎమ్మెల్యే రిషికేశ్‌ పటేల్‌ కారుపై దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది పాటిదార్‌ ఆందోళన నాయకులేనంటూ ఎమ్మెల్యే కేసు పెట్టారు. ఈ కేసులో హార్దిక్‌, లాల్‌జీ పటేల్‌లతో పాటు పలువురికి అరెస్టు వారెంట్‌ జారీ చేశారు. దీంతో నేడు హర్దిక్‌ కోర్టులో హాజరయ్యారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అతడికి బెయిల్‌ మంజూరు చేసింది. 2015లో హార్దిక్‌ పటేల్‌ ఆధ్వర్యంలో పటేల్‌ వర్గీయులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో దేశద్రోహం కేసులో హార్దిక్‌ అరెస్టయ్యాడు. ఆ తర్వాత తొమ్మిది నెలలకు బెయిల్‌పై విడుదలయ్యాడు.