హావిూల అమలులో టిఆర్‌ఎస్‌ విఫలం : డిసిసి

ఆదిలాబాద్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. తిరిగి టిఆర్‌ఎస్‌ అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టో పచ్చి అబద్ధాల పుట్టగా అభివర్ణించారు. 1200 మంది అమరుల కుటుంబాలను ఆదుకోలేదన్నారు.  కొత్త
వాగ్దానాలంతో ప్రజలను మోసం చేసేందుకు టీఆర్‌ఎస్‌ బయలు దేరిందని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామాకాలన్నారు..నిధులు పార్టీలో కొంతమందికే వచ్చాయని ఆరోపించారు. నియామకాలు ఎటుపోయాయో తెలియదని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం కల్ల అని మండిపడ్డారు.
మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చేప్పిన కేసీఆర్‌ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. కఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా పేదలకు స్వయం ఉపాధి కింద రుణాలు ఇస్తామన్న ప్రభుత్వం ఒక్కరికీ ఇవ్వలేదన్నారు. ఆసరా పింఛన్లలో అందిరినీ మోసం చేసిందన్నారు. భారీ వర్షాలు, వరదలతో పంటలు నష్టపోయిన రైతులను పూర్తి స్థాయిలో ఆదుకునే చర్యలు ప్రభుత్వం చేపట్ట లేదన్నారు.  అరకొర పరిహారం అందించి చేతులు దులుపుకునే పద్ధతి అవలంబించి ఇప్పుడు తమది రైతుబాట అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. పంట నష్టపోయిన బాధిత రైతులకు ధీమా కల్పించాలన్నారు. ప్రకృతి ఆగ్రహానికి రైతులు బలి అవుతున్నారన్నారు.