హాస్టళ్ల వసతుల కల్పనకు 100 కోట్లు

3

– కడియం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌21(జనంసాక్షి):

తెలంగాణలోని హాస్టల్స్‌ వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. తెలంగాణలోని హాస్టల్స్‌ వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుపోతుంది. మోడల్‌ స్కూల్స్‌, కస్తుర్బా గాంధీ పాఠశాలలు, తెలంగాణ రెసిడెన్షియల్స్‌ను అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది.ఈ సందర్భంగా విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ మోడల్‌ స్కూల్స్‌లో మౌలిక వసతులకు వంద కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కస్తూర్బా పాఠశాలల్లో మౌలిక వసతులకు 50 కోట్లు ఇస్తామని కడియం పెర్కొన్నారు. వీటితో పాటుగా రెసిడెన్షియల్‌ పాఠశాలలకు రూ.89 కోట్లు కేటాయించామని ఆయన వివరించారు. మార్చి 31లోపు పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. త్వరలో కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి కడియం సచివాలయంలో విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. వర్సిటీల సమస్యలపై ఈనెల 26న వీసీలతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామని కడియం అన్నారు.  ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఈ నిధులతో మోడల్‌, కేజీవీపీ, తెలంగాణ రెసిడెన్షియల్స్‌లో మౌలిక వసతులతో పాటు ఫర్నీచర్‌, ప్రహారీ గోడలు, సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణకు 194 మోడల్‌ పాఠశాలలు మంజూరు అయ్యాయి. ఇప్పటికే 182 పాఠశాలలు పని చేస్తున్నాయని చెప్పారు. 182 పాఠశాలల్లో లక్షా 75 వేల మంది విద్యార్థిని, విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. కస్తుర్బా పాఠశాలలో రూ. 40 కోట్లతో ప్రహరీ గోడలు, మిగతా రూ. 10 కోట్లతో ఫర్నీచర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. మోడల్‌ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం కింద షెడ్లు నిర్మిస్తామన్నారు.