హిమాచల్‌పై తేల్చని బిజెపి

న్యూఢిల్లీ,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో అక్కడ సిఎం అభ్యర్థి ఎవరన్నది తేలలేదు. సిఎం అభ్యర్థి ధుమాల్‌ ఓటమితో కొత్తగా ఎవరిని నిలబెట్టాలన్నది ఆలోచనచేస్తున్నారు. పార్లమెంటరీ పార్టీ భేటీలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకావం ఉంది. అయితే సుజన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్‌ కుమార్‌ ధూమల్‌ మాత్రం ఓడిపోయారు. దీంతో ఇప్పుడిక్కడ సీఎం ఎవరనేది ఆసక్తిగా మారింది. అయితే కేంద్రమంత్రి జగత్‌ ప్రకాష్‌ నడ్డాతోపాటు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జైరామ్‌ ఠాకూర్‌ సీఎం రేసులో ఉన్నారు. సీఎం అభ్యర్థిపై బీజేపీ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయనప్పటికీ.. నడ్డావైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమిపాలవడంతో వీరభద్ర సింగ్‌ ముఖ్యమంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేశారు. త్వరగా అక్కడ ప్రభుత్వం ఏర్పాటుచేయాల్సి ఉంది.