హిమాచల్‌లో స్వల్ప భూకంపం
సిమ్లా:,ఫిబ్రవరి23 (జనం సాక్షి) : హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో బుధవారం ఉదయం 9.58 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌ఎస్‌సీ) తెలిపింది. రాంపూర్ సబ్ డివిజన్‌లోని సెరి మజ్‌హైల్ వద్ద 7 కిలోవిూటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టువెల్లడిరచింది. భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగినట్టు తెలియలేదు.