హిమాచల్ వరదనష్టం పదివేలకోట్లు
సిమ్లా,సెప్టెంబర్2 జనం సాక్షి : ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ నష్టం పదివేల కోట్లుగా ఉంటుందని అంచనా. వర్షం కారణంగా సంభవించిన వరదలతో ఆ రాష్ట్రం పూర్తిగా దెబ్బతింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. సుమారు రూ.10 వేల కోట్లకుపైనే ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా వేశారు. అయితే, వర్షం సంబంధిత విపత్తులో రాష్ట్రంలో సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి జగత్‌సింగ్ నేగి తెలిపారు. జూన్ 24వ తేదీన రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించడంతో కుండపోతగా వర్షాలు కురిశాయి. ఈ విపత్తులో సుమారు 400 మంది మరణించినట్లు మంత్రి తాజాగా వెల్లడిరచారు. మరో 400 మందికి పైగా గాయపడ్డట్లు చెప్పారు. ఇప్పటి వరకు 2,500 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, 11,000 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని వివరించారు.